News November 19, 2025
అన్నదాత సుఖీభవ పండుగ వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని, కార్యక్రమంలో పాల్గొనే రైతులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<
News January 24, 2026
HYD: ‘జూబ్లీహాల్’ పేరెలా వచ్చిందంటే?

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?
News January 24, 2026
తిరుమలేశుడే ప్రతిష్ఠించిన సూర్యభగవానుడి ఆలయం

తిరుమలేశుడే పద్మావతిదేవి కోసం తిరుచానూరులోని పద్మసరోవం ఎదురుగా శ్రీ సూర్యనారాయణస్వామి వారిని ప్రతిష్ఠించారు. స్వామివారి శిలారూపంలో 2 చేతుల్లో కమలాలు ధరించి, కిరీటం, మెడ కంఠహారాలు, యజ్ఞోపవీతం, కరకంకణాల మలచబడి ఉన్నాయి. పద్మపీఠంపై నిలబడిన స్వామివారి నడుము నుంచి పాదాల వరకు ధోవతి ధరించినట్లు కనిపిస్తుంది. ఈఆలయానికి బలిపీఠం, ధ్వజస్తంభం లేదు. సండే, ప్రత్యేక రోజుల్లో విశేష ఉత్సవాలు, అభిషేకాలు జరుగుతాయి.


