News April 2, 2024
అన్నను హత్య చేసిన దుర్మార్గుడివి నువ్వు: BC జనార్దన్ రెడ్డి

బనగానపల్లె ఎమ్మెల్యే కొడుకు ఓబుల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ఒరే ఓబుల్ రెడ్డి లఫూట్. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మీ అన్న నాగార్జున రెడ్డిని రాత్రికి రాత్రి గొంతు నులిమి ఫ్యానుకు వేలాడిదీసినావ్. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మా అన్న గురించి, మా కుటుంబం గురించి. ఆస్తి కోసం హత్య చేసిన దుర్మార్గుడిని నువ్వు’ అని ఆరోపించారు.
Similar News
News February 10, 2026
మహా శివరాత్రికి శైవక్షేత్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, ఎండోమెంట్స్ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల్లో పారిశుద్ధ్యం, క్యూలైన్లు, బ్యారికేడింగ్, తాగునీరు, షేడ్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
News February 10, 2026
పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్‌పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్‌లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News February 10, 2026
డ్రోన్ పెట్రోలింగ్‌తో కర్నూలు పోలీసుల స్మార్ట్ నిఘా

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.


