News April 14, 2024
అన్నపై దాడిని ఖండించిన చెల్లి షర్మిల

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడిని తన సోదరి వైఎస్ షర్మిల ఖండించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడిని ఆమె దురదృష్టకరమైన ఘటన అంటూ ఖండిస్తూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు.
Similar News
News December 11, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.
News December 11, 2025
విజేత కడప జట్టు

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.
News December 11, 2025
కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.


