News May 7, 2025
అన్నమయ్య: ఈ రెండు మండలాల ప్రజలు జాగ్రత్త

అన్నమయ్య జిల్లాలో నిన్న భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే శనివారం నందలూరు, పెనగలూరు 41.2 డిగ్రీలు, ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పైన తెలిపిన రెండు మండలాల ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని పేర్కొంది.
Similar News
News February 11, 2026
వరుస హత్యలతో సీతంపేటలో ఆందోళన!

MHBD(D) గార్ల మండలం సీతంపేట పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహేష్ అనే యువకుడి హత్య, అంకన్నగూడెంలో కన్నబిడ్డలకే విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, అత్తను అల్లుడే కరెంట్ షాక్‌తో చంపడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మానవతా విలువలు మంటగలుస్తున్నాయని, ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు, సామాజిక సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.
News February 11, 2026
తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.


