News September 10, 2025

అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

image

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.

Similar News

News December 12, 2025

టాటూలతో స్కిన్ క్యాన్సర్ ముప్పు

image

ఫ్యాషన్ కోసం చాలామంది టాటూస్ వేయించుకుంటుంటారు. అయితే దీనివల్ల స్కిన్ క్యాన్సర్ ముప్పు 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. లండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో టాటూ వేయించుకున్నవారికి తీవ్రమైన మెలనోమా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి టాటూ వేయించుకున్న ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

సర్పంచ్ ఎన్నికలు.. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట టాప్

image

సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నల్గొండలో 318, యాదాద్రిలో 153, సూర్యాపేటలో 159 జీపీల్లో పోలింగ్ జరగ్గా వరుసగా 90.53, 92.88, సూర్యాపేటలో 90.18 పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రంలోనే యాదాద్రి టాప్‌లో నిలవగా, నల్గొండ, సూర్యాపేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

News December 12, 2025

అనఘాష్టమి వ్రత విధానం

image

పూజా మందిరంలో పీఠంపై దత్తాత్రేయుడు చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. అష్టదళ పద్మం వేసి, దానిపై కలశం ఉంచి, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. మొదట గణపతి పూజ చేయాలి. అనంతరం అనఘస్వామిని ఆరాధించాలి. పగటిపూట నిద్రించకూడదు. ఉపవాసం ఉండాలి. ‘ఓం దత్తాత్రేయాయ నమః’ అని స్మరించాలి. రాత్రిపూట సాత్వికాహారం తీసుకోవాలి. వ్రతం పూర్తయ్యాక దక్షిణ, తాంబూలం, వ్రత పుస్తకాలు ఇవ్వాలి. ఈ వ్రతం మహిళలు ఎవరైనా చేయవచ్చు.