News April 23, 2025

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News March 11, 2026

గుంటూరులో వ్యభిచార గృహంపై దాడి

image

కొత్తపేట PS పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన ఓ అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి సెల్ ఫోన్లు, 2 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి (అరండలపేట), రాపోలు శివను నిందితులుగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం కేసును కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

News March 11, 2026

రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

News March 11, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ డైరెక్టర్‌గా సుబాసిస్ సేన్ గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సుభాసిస్ సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పురుషోత్తం పదవీ విరమణ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 12 మందిలో ఆయనను ఎంపిక చేశారు. వచ్చే నెలలో సుభాసిన్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.