News March 7, 2025
అన్నమయ్య జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. దీంతో ఉమ్మడి కడప జిల్లాలోని పలుప్రాంతాల ప్రజలు అయోమయానికి గురికాక తప్పదు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో అనుసంధానం చేశారు. దీంతో రాజంపేట, కోడూరు ప్రాంతాల మహిళలు ఒంటిమిట్టకు వెళ్లలేరు. దీంతో వీరంతా టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండేవారికి ఉచిత ప్రయాణం వర్తించకపోవడంపై మీ కామెంట్.
Similar News
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.
News December 11, 2025
TML: కల్తీ అని తెలిసినా ఎలా అనుమతించారు?

తిరుమల కల్తీ నెయ్యి కేసు సిట్ కస్టడీలో రెండో రోజు ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అజయ్ కుమార్ సుగంధ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. మైసూరు రిపోర్ట్ వచ్చాక ఎవరికి చెప్పారు? కల్తీ అని తెలిసినా ఎందుకు తప్పు చేశారు? వారు ఇచ్చే కమీషన్లకు ఎందుకు తలొగ్గారు? అని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. ఈయన కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
News December 11, 2025
నంద్యాల మీదుగా వెళ్లే రైలుకు బోగీల పెంపు

నంద్యాల మీదుగా ప్రయాణించే గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మార్పు చేశారు. గతంలో 19 బోగీలతో ఉన్న ఈ రైలు ఇక నుంచి 24 బోగీలతో ప్రయాణించనుంది. ఇందులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సౌకర్యం ఈ నెల 18 నుంచి తిరుపతి వైపు రైలుకు, 19 నుంచి గుంటూరు వైపు రైలుకు అందుబాటులోకి రానుంది.


