News August 21, 2025

అన్నమయ్య జిల్లాలో విషాదం

image

అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన రాజంపేట మండలం బాలరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఇసుక ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

బాపట్ల: గుడ్ న్యూస్.. రూ.50 వేల సబ్సిడీతో రుణాలు

image

జిల్లాలోని SC స్వయం సహాయక సంఘం సభ్యులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం అజయ్ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు DRDA PD సింగయ్య గురువారం తెలిపారు. జిల్లాలో 183 మందికి లబ్ధి చేకూరనుందన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీ, మిగతా మొత్తం వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. 20-35 ఏళ్ల వయసు ఉండి, కొత్త యూనిట్లు స్థాపించే వారు ఈనెల 24లోపు స్థానిక వెలుగు కార్యాలయలలో సంప్రదించాలని సూచించారు.

News January 23, 2026

MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

image

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 23, 2026

అనంతపురం JNTU విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.