News September 13, 2025
అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News December 15, 2025
హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవు: ప్రధాని అల్బనీస్

బాండీ బీచ్ వద్ద <<18561798>>ఉగ్రదాడి<<>> బాధితులకు అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవని, దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీఎం మృతులకు నివాళి అర్పించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బాండీ బీచ్ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరగా 42 మంది గాయపడ్డారు.
News December 15, 2025
గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.
News December 15, 2025
కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.


