News September 13, 2025
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో పాడేరులో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ధీరజ్ రానున్నారు. విద్యాసాగర్ నాయుడిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ అనేక సంచలనాత్మక హత్య కేసులతో పాటు దోపిడీ కేసులను ఛేదించి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు.
Similar News
News December 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 12, 2025
కామారెడ్డి: NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ

భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో KMR ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.
News December 12, 2025
ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.


