News September 12, 2025

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్

image

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను బదిలీ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఈయనను ఎక్కడికి బదిలీ చేశారో తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

image

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.

News December 10, 2025

HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

image

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.

News December 10, 2025

ఏలూరులో AI ల్యాబ్‌లు: MP

image

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.