News November 30, 2025

అన్నమయ్య జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాను నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో కె.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కాలేజీలకు సెలవులపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Similar News

News February 17, 2026

కొత్తగూడెం: పవర్ షేరింగ్‌పై హస్తం పార్టీలో రుసరుసలు

image

కొత్తగూడెం కార్పొరేషన్‌లో పవర్ షేరింగ్ ఫార్ములా కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. 28 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ, కేవలం 22 సీట్లు గెలిచిన సీపీఐకి మేయర్ పదవిని కట్టబెట్టడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని నిరసిస్తూ 26వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్ నల్ల బ్యాడ్జీతో నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 17, 2026

అనకాపల్లి జిల్లాలో క్రీడలను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సహం అందిస్తే అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ది అధికారిణి శైలజతో కలిసి ‌క్రీడల గోడపత్రిక ఆవిష్కరించారు.

News February 17, 2026

పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

image

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.