News September 12, 2025
అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్దగల చెన్నకేశవస్వామి గుడి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ(70), రామచంద్రయ్య(50) మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: ఈ నెల 18న పెన్షన్ అదాలత్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 18న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం, పదవీ విరమణకు ముందే పింఛను ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియపై అవగాహన ఉంటుందన్నారు. పింఛనుదారులు, అధికారుల మధ్య దూరం తగ్గి, సమస్యల పరిష్కారానికి ఒక వేదిక లభిస్తుందన్నారు.
News December 11, 2025
ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 11, 2025
మహబూబాబాద్: MLAకు చేదు అనుభవం.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓట్ల లెక్కింపు చేస్తూ ఒక్కొక్క అభ్యర్థి గెలుపును అధికారులు ప్రకటిస్తున్నారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో
ఎమ్మెల్యే మురళి నాయక్ సొంత వదిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భూక్య కౌసల్యపై 27 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బాలాజీ నాయక్ గెలుపొందారని అధికారులు తెలిపారు.


