News November 30, 2025
అన్నమయ్య: రేపటి గ్రీవెన్స్ డే రద్దు

తుఫాన్ నేపథ్యంలో రాయచోటిలో డిసెంబర్ 1న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)ను రద్దు చేస్తున్నట్లు SP ధీరజ్ ప్రకటించారు. తుఫాను కారణంగా ప్రజలు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి ఎవరూ జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దని SP సూచించారు.
Similar News
News February 11, 2026
గుండారం గుట్టల ప్రాంతంలో పెద్దపులి..?

కోహెడ మండలం నుంచి మల్లారం హైవే దాటి పెద్దపులి బెజ్జంకి మండలంలోని మల్లోని చెరువు గుండారం గుట్టల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, చీకటి పడే వరకు పొలాల వద్ద ఉండకూడదని హెచ్చరించారు. బెజ్జంకి పోలీసులు కూడా గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ గస్తీని పెంచారు.
News February 11, 2026
VKB: 4 మున్సిపాలిటీల్లో @9am 11.15% పోలింగ్

VKBలోని 4 మున్సిపాలిటీల్లో 9 గంటల వరకు 11.15% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్‌లో 11.56%, తాండూర్‌లో 10.39% పరిగిలో 10.78%, కొడంగల్‌లో 15.21% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత భారీగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News February 11, 2026
పార్వతీపురం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పార్వతీపురం జిల్లాలో మొత్తం 10,882 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. వీరి కోసం 67 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.


