News December 2, 2025
అన్నవరం ఆలయానికి ఆరో స్థానం

ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానానికి 6వ స్థానం దక్కింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం సర్వే చేసింది. అందులో అన్నవరం ఆలయం 69.7% తో ఆరో స్థానం దక్కించుకుంది. ప్రసాదానికి 77.6% బాగుందని వచ్చింది. శానిటేషన్ విషయంలో 64.2 శాతం మంది మాత్రమే నిర్వహణ బాగుందన్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు ఈ సర్వే జరిగింది. మరి మన అన్నవరం ఆలయ నిర్వహణపై మీ కామెంట్.
Similar News
News February 17, 2026
300కు 300 మార్కులు

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.
News February 17, 2026
ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.
News February 17, 2026
KMR: పురం.. సమస్యల వలయం

కామారెడ్డి జిల్లాలో నూతన మున్సిపల్ కౌన్సిల్‌లు కొలువుదీరాయి. నూతన కౌన్సిలర్లకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఛైర్మన్/ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు చూపాలి. చెత్త నిర్వహణ సరిగ్గా లేక ఆయా మున్సిపాలిటీలు పేరుకుపోయాయి. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలి. నగర సుందరీకరణకు పాటుపడాలి. ఎల్లారెడ్డి, బిచ్కుందలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలి.


