News November 7, 2025
అన్నవరం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నిత్య కల్యాణ మండపంలో నిర్వహించారు. 30 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా ఆలయానికి రూ.1 కోటి 73 లక్షల 37 వేల ఆదాయం లభించింది. భక్తులు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సమర్పించారని ఈఓ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రోహిత్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.
News January 23, 2026
చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.
News January 23, 2026
ADB జిల్లాలో క్షయ నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

క్షయ వ్యాధి నిర్మూలనలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, తప్పుడు సమాచారాన్ని అరికట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీబీ చికిత్స విజయవంతం కావడానికి ముందస్తు నిర్ధారణ, టీబీ ప్రివెంటివ్ థెరపీ, పోషకాహార మద్దతు అవసరమని తెలిపారు. టీబీ వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సత్కరించారు.


