News October 6, 2025

అన్ని గ్రామాలకు నీరందించాలి: కలెక్టర్

image

జల సంరక్షణ ప్రణాళికపై RWS ఇంజినీర్లకు బాపట్ల విస్తరణ శిక్షణా కేంద్రంలో 3 రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జల జీవన్ మెషిన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News January 16, 2026

రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

image

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్‌ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.

News January 16, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ఫర్నిచర్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోసం రేపు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ
✓ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలి: CPIML
✓ జూలూరుపాడు: అదుపుతప్పి గోడను ఢీకొన్న గ్యాస్ లారీ
✓ టేకులపల్లి: క్రికెట్ పోటీలు అడ్డుకున్న పోలీసులు
✓ పినపాక: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీఎస్పీ
✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ రామవరంలో పోలీసుల వాహన తనిఖీలు

News January 16, 2026

‘హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలి’

image

హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ కార్యక్రమానికి హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ సహా పరిసర మండలాల ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం కోరారు.