News January 18, 2025
అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు: కలెక్టర్

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం, కలెక్టరేట్ నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల 3శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. లోకేశ్‌కు 8వ ర్యాంకు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో గుంటూరు జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్ 4 ర్యాంకు రాగా, లోకేశ్‌కు 8వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.
News February 6, 2025
ANU: దూరవిద్యలో ఫైర్ సేఫ్టీ కోర్సులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ విశాఖపట్నం మధ్య విద్యాసంబంధ సహకారాన్ని కొనసాగించడం కోసం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ.. అగ్ని భద్రత, అత్యవసర ప్రతిస్పందన సంబంధిత రంగాలలో ఎన్ఐఎఫ్ఎస్ గత 25ఏళ్ళుగా శిక్షణ ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల వలన ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
News February 6, 2025
గుంటూరు: బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.