News September 12, 2025

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ పోలీసులు

image

అపరిచితులతో ఫోన్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అపరిచితులతో న్యూడ్ వీడియో కాల్స్‌లో పాల్గొనవద్దని, అలా ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యాశతో మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు.

Similar News

News December 8, 2025

సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.

News December 8, 2025

వేములవాడ: ఎంపీడీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ

image

వేములవాడ అర్బన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తనిఖీ చేశారు. కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News December 8, 2025

వేములవాడ: ‘ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగర్వాల్ సోమవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో కల్పించిన వసతులపై ఆరా తీసి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్, కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.