News October 8, 2025

అప్పన్న అభరణాల లెక్కింపులో తిర’కాసు’..!

image

సింహాచలం దేవస్థానంలో అభరణాల లెక్కింపు ఇంకా కొలిక్కి రాలేదు. బండాగారంలో వెండి అధికంగా ఉండటం సంబంధిత రిజిస్టారులో నమోదు శాతం తక్కువగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూర్వ AEO ఆనంద్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులకు నోటీసులు జారీ చేయడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. కడపకు చెందిన ప్రభాకర ఆచారి అప్పన్న ఆలయంలో అభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదుతో దేవదాయశాఖ ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

Similar News

News January 23, 2026

ఒడిశాకు కీలక లైన్లు? ఏపీకి షాక్‌గా మారిన రైల్వే విభజన

image

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అనుమానాలకు తావిస్తుండగా, జ్యూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన KK లైన్‌ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.

News January 23, 2026

వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

image

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

News January 23, 2026

నేడు వికారాబాద్‌‌లో స్పీకర్‌ను కలవొచ్చు

image

నేడు తెలంగాణ శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రానున్నారు ఉ. 10:00 గం.కు హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ నుంచి వికారాబాద్ బయలుదేరుతారు. 12:00 గం.కు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.