News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.

Similar News

News January 23, 2026

కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

image

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

News January 23, 2026

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

image

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 23, 2026

ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

image

అనంతపురంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.