News September 12, 2025

అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల మరుగుదొడ్లు, ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు పనులను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ చందునాయక్ పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

image

భారత్‌తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News December 16, 2025

WGL: స్వస్తిక్ ముద్ర బాక్స్ దాటితే చెల్లదంతే..!

image

జిల్లాలో మూడో విడత ఎన్నికలు బుధవారం జరగనుంది. స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు, తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్‌లో పేర్లు లేకుండా గుర్తులు మాత్రమే ఉంటాయి. గుర్తుల పక్కన ఉన్న బాక్స్‌లో ఓటరు స్వస్తిక్ ముద్రను వేయాలి. ఓటర్లు ఓటు అలా వేయకుండా గడి దాటి ముద్రవేస్తే గడి సరిహద్దులపై పడితే చెల్లదు. ఎమరుపాటు ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News December 16, 2025

SVU పీజీ ఫలితాలు విడుదల.!

image

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది జనవరిలో పీజీ (PG) M.A రూరల్ డెవలప్మెంట్/ హిందీ/ ఎకనామిక్స్ టూరిజం/ తెలుగు, ఎంఎస్సీ ఆక్వా కల్చర్, M.Com(R) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.results.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.