News July 31, 2024

అభివృద్ధి వైపు పయనిస్తున్న ఏపీ: అనకాపల్లి ఎంపీ

image

ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు భారత్ మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్నట్లు X ద్వారా పేర్కొన్నారు. నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్-విశాఖ కారిడార్, బెంగళూరు చెన్నై ఎక్స్ ప్రెస్ వే, రాయపూర్-విశాఖపట్నం కారిడార్, చిత్తూరు- థాచూర్ కారిడార్, బెంగళూరు- కడప-విజయవాడ కారిడార్ ఉన్నాయన్నారు.

Similar News

News January 20, 2026

జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

image

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.

News January 20, 2026

విశాఖ కలెక్టర్‌కు అవార్డు

image

విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

News January 20, 2026

జీవీఎంసీ అభివృద్ధి పనులు ఆదర్శనీయం: కేంద్ర బృందం

image

విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆదర్శనీయంగా ఉన్నాయని న్యూఢిల్లీ IIPA అర్బన్ స్టడీ బృందం ప్రశంసించింది. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో భేటీ అయిన 9 మంది సభ్యుల బృందం నగరంలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకుంది. అనంతరం కాపులుప్పాడ, ముడసర్లోవ ప్లాంట్‌లను సందర్శించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.