News July 4, 2024
అమరచింత: టీచర్‌పై రౌడీషీటర్ దాడి

అమరచింతలో GOVT టీచర్‌పై రౌడీషీటర్ దాడి చేశాడు. MEO భాస్కర్ సింగ్ వివరాలు.. స్థానిక స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ కొట్టారు. ఈ విషయమై విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా నచ్చజెప్పి పంపారు. బుధవారం విద్యార్థి తండ్రితోపాటు వచ్చిన రౌడీషీటర్ సదరు టీచర్‌పై దాడీచేసి బ్లేడ్‌తో బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని కానీ కేసు వద్దన్నారని SI సురేశ్ చెప్పారు.
Similar News
News December 14, 2025
MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

మిడ్జిల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మసి గుండ్లపల్లి సర్పంచ్‌గా శ్రీశైలం యాదవ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద చెన్నయ్య 16ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
News December 14, 2025
MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
News December 14, 2025
MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


