News August 20, 2025

అమరచింత: నాడు అంబటి జీతగాడు.. నేడు చదువుల పుత్రుడు

image

అమరచింతకి చెందిన ఆర్ఎన్ శంకర్ చిన్నప్పుడు అమరచింతలో పశువుల కాపరి. పట్టుదలతో చదివాడు, వామపక్ష ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల పుత్రుడు అయ్యాడు. నాడు అంబటి జీతగాడిగా ఉన్న శంకర్ నేడు పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నారాయణ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా హైదరాబాదులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు.

Similar News

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.

News January 17, 2026

ఆ ప్లేయర్‌ను చివరి వన్డేలోనైనా ఆడించండి: అశ్విన్

image

న్యూజిలాండ్‌తో రెండు వన్డేలకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడో వన్డేలోనైనా అతడిని ఆడించాలని సూచించారు. అర్ష్‌దీప్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, జట్టు విజయాల్లో భాగమయ్యాడని తెలిపారు. అయినా టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్నాడని చెప్పారు. బ్యాటర్ల విషయంలో ఇలా జరగదని, ప్రతిసారీ బౌలర్లే బలవుతున్నారని పేర్కొన్నారు.