News November 30, 2025

అమరచింత: 35 ఏళ్లుగా ఉపసర్పంచ్‌గా ఊసిరెడ్డి

image

అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామానికి చెందిన మోరెడ్డి వంశీయులు 35 ఏళ్లుగా ఉప సర్పంచ్‌గా కొనసాగారు. గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డి 35 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి వయసు మీద పడడంతో ఆయన పదవికి ఆసక్తి చూపలేదు. 35 ఏళ్లుగా సర్పంచి ఉపసర్పంచ్ పదవికి చుక్క, మోరెడ్డి వంశీలే ఉండడం విశేషం.

Similar News

News February 16, 2026

పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

image

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2026

అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

image

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.

News February 16, 2026

రేపు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

image

నులి పురుగులు చిన్నారుల్లో రక్త హీనతకు దారి తీస్తాయని బాపట్ల డీఎంహెచ్ఓ విజయమ్మ చెప్పారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 3.29 లక్షల మంది చిన్నారులకు మాత్రలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా మాత్రలు తీసుకోవాలని సూచించారు.