News December 1, 2025

అమరావతికి మహర్దశ..16,666 ఎకరాల్లో మెగా ప్లాన్.!

image

రాజధాని అమరావతి దశ తిరగనుంది. ఏకంగా 16,666 ఎకరాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అమరావతిని నెక్ట్స్ జనరేషన్ గ్రోత్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’, కొత్త రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. కనెక్టివిటీ, క్రీడలు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ఈ ప్లాన్ లక్ష్యం.

Similar News

News February 16, 2026

రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in

News February 16, 2026

బహుమతిగా ఇవ్వకూడని కొన్ని వస్తువులు

image

కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తే సంబంధాలు దెబ్బతింటాయని నమ్మకం. ముఖ్యంగా నలుపు రంగు వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదంటున్నారు పండితులు. ‘ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. పర్సు ఇస్తే సంపద తగ్గవచ్చు. పర్ఫ్యూమ్స్, జేబు రుమాలు ఇస్తే మనస్పర్థలు, సమస్యలు తలెత్తుతాయి. ముత్యాలు కన్నీళ్లకు చిహ్నం కాబట్టి వాటిని కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూలత పెరిగి, బంధాలు బలంగా ఉంటాయి.

News February 16, 2026

KNR: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. కరీంనగర్ డివిజన్‌లో 25, పెద్దపల్లి డివిజన్‌లో 32 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380, ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.