News December 1, 2025

అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్

image

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.

Similar News

News February 13, 2026

వినియోగదారుల హక్కులు పరిరక్షించాలి: JC

image

వినియోగదారుల హక్కులు పరిరక్షణ జరగాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జేసీ మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు సూచించిన అంశాల పట్ల సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News February 13, 2026

GNT: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరు జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, అందులో అత్యవసర మందులు ఉండాలని చెప్పారు.

News February 13, 2026

GNT: క్వారీ తిరునాళ్లపై ఎస్పీ వకుల్ జిందాల్ నిఘా

image

వడ్లమూడి క్వారీ తిరునాళ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రభల ప్రదేశాలు, పొంగళ్ల స్థలాలను సందర్శించి అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.