News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.

Similar News

News December 8, 2025

ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

image

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్‌లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

News December 8, 2025

బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.