News October 7, 2025
అమలాపురంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు: కలెక్టర్

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అధికారికంగా నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News January 15, 2026
NIA కొత్త సారథిగా రాకేశ్ అగర్వాల్ నియామకం

కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. 1994 బ్యాచ్ IPL అధికారి రాకేశ్ అగర్వాల్ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయ్యారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు వరకు కొనసాగనుంది. మరోవైపు హరియాణా మాజీ DGP శత్రుజీత్ సింగ్ కపూర్‌ను ITBP డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీ డీజీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్‌ఎఫ్ DGగా బాధ్యతలు అప్పగించింది.
News January 15, 2026
కోవూరు : సంక్రాంతి అంటే మీకు తెలుసా..?

సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అతి పవిత్రమైన రోజు. దీనితో ఉత్తరాయన పుణ్య కాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. దీనిని నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలతో, రంగవల్లులతో పెద్దలకు నమస్కరించి కొత్త జీవితాన్ని స్వాగత్తిస్తూ కుటుంబసమేతంగా జరుపుకుంటారు. పండుగ విశిష్టత తెలిసినవారు కామెంట్ చేయండి.
News January 15, 2026
ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై దాడి ఖాయం!

ఇరాన్‌పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.


