News March 18, 2024

అమలాపురం అల్లర్లు.. జీవోపై హైకోర్టు స్టే

image

అమలాపురం అల్లర్లపై కేసులు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దళిత నాయకులు జంగా బాబురావుతో పాటు మరో ఆరుగురు నేతలు వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై గొడవలు జరిగాయి. అప్పట్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 15, 2024

తలుపులమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

image

తుని మండలంలోని లోవలో ఉన్న తలుపులమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థానం ఈఓపి విశ్వనాథరాజు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, వస్త్రాలు వారికి అందజేశారు.

News September 14, 2024

రాజానగరంలో తీవ్ర విషాదం

image

రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

News September 14, 2024

కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి

image

వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.