News November 20, 2025

అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

image

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్‌పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News January 13, 2026

కామారెడ్డి: మత్తులో నడిపితే.. జైలులో పడాల్సిందే!

image

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 33 మందికి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నలుగురికి రెండు రోజులు, పది మందికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. మిగిలిన వారితో కలిపి మొత్తం రూ.38,500 జరిమానా విధించినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది. ప్రజల భద్రత కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని SP స్పష్టం చేశారు.

News January 13, 2026

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

image

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>