News March 13, 2025
అమలాపురం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

జనసేన ఆవిర్భావ సభకు కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
Similar News
News February 11, 2026
స్పీకర్‌పై ‘అవిశ్వాసం’.. ఇప్పుడేం జరుగుతుంది?

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస <<19101605>>తీర్మానానికి<<>> ప్రతిపక్షాలు నోటీసులివ్వడం తెలిసిందే. ముందుగా తీర్మానంలో వాడిన భాషను డిప్యూటీ స్పీకర్/ప్యానల్ ఛైర్ పర్సన్ పరిశీలిస్తారు. 14 రోజుల తర్వాత సభ పరిశీలనకు తీర్మానం వస్తుంది. ఈ సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించరు. తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంటుంది. 10 రోజుల్లోగా లోక్‌సభలో చర్చించి తేల్చాల్సి ఉంటుంది.
News February 11, 2026
ఖమ్మం: పందిళ్లపల్లికి 1,334 టన్నుల యూరియా

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను ఖమ్మం (634 టన్నులు), భద్రాద్రి కొత్తగూడెం (200), మహబూబాబాద్ (400) జిల్లాలకు కేటాయించారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
News February 11, 2026
జనగామ: 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. జనగామలో 8, స్టేషన్ ఘనపూర్ లో 4 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు ఎన్నికల అధికారులు చేపట్టారు.


