News February 17, 2025

అమలాపురం: మహా కుంభమేళా యాత్రకు డిమాండ్

image

మహా కుంభమేళా యాత్రకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతుందోని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 12వ తేదీన 6 ఆర్టీసీ బస్సుల్లో భక్తులు మహా కుంభమేళాకు వెళ్లారు. మరికొంతమంది భక్తులు ఆసక్తి కనబరుస్తుండటంతో 18వ తేదీన మరికొన్ని బస్సులను కుంభమేళాకు వెళ్లెందుకు ఏర్పాటు చేస్తున్నారు. 21వ తేదీన కుంభమేళాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తెలిపారు.

Similar News

News April 15, 2026

ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

image

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

ప.గో: ప్రేమ విఫలమై యువకుడు సూసైడ్!

image

భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) మల్లిపూడికి చెందిన రాజేశ్(23) ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా ఈనెల 13న మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.

News April 15, 2026

నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.