News February 21, 2025
అమలాపురం లాడ్జిలో డాక్టర్ మృతి

అమలాపురం పట్టణంలో లాడ్జిలో ప్రేమ విఫలమై వైద్యుడు అనుమాన స్థితిలో మృతి చెందాడు. టౌన్ సీఐ వీరబాబు గురువారం తెలిపిన వివరాలు.. విజయవాడ వద్ద పోరంకికి చెందిన వైద్యుడు యలమంచిలి వెంకట్ జైనేంద్రి ( 28) మృతి చెందారు. జైనేంద్రి కిమ్స్ హాస్పిటల్‌లో వైద్యుడిగా పనిచేశాడు. వారం రోజుల నుంచి గణపతి లాడ్జిలో ఉంటూ విపరీతంగా మద్యం తాగి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 23, 2025
ఖమ్మం: బావిలో పడి మహిళా కూలీ మృతి

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నాగులవంచ గ్రామానికి చెందిన కూరపాటి రాంబాయి (54) అనే మహిళ శనివారం ఉదయం కూలీ పనికి వెళ్లగా తాగునీరు కోసం బావి దగ్గరికి వెళ్లి మంచినీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల మీరా కేసు నమోదు చేశారు.
News March 23, 2025
బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.
News March 23, 2025
ఈనెల 30న కృష్ణా జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈనెల 30వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరుకానున్నారు.