News August 14, 2025
అమలాపురం విద్యుత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

అల్పపీడనం కారణంగా సంభవించే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం తెలిపారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలపై అమలాపురం విద్యుత్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా తలెత్తే విద్యుత్ అంతరాయాలపై సమాచారం కోసం 9440904477 లేదా 1912 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 7, 2026
వార్ ఎఫెక్ట్.. రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

ముడి చమురు ధర దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90 డాలర్లకు పెరిగింది. 2024 APR తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్ హైక్ చివరగా 2020 ఏప్రిల్‌లో నమోదైంది. ఇరాన్‌తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్‌లో తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి.
News March 7, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.
News March 7, 2026
మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నారు.. కానీ: ఇరాన్ అధ్యక్షుడు

మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్‌కియాన్ వెల్లడించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనుకాడబోమన్నారు. మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్న దేశాలు యుద్ధం ప్రారంభించిన దేశాలపై దృష్టిసారించాలని సూచించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తగ్గితే కానీ తాము తగ్గబోమని హింట్ ఇచ్చారు.


