News March 29, 2025
అమలాపురం: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో సలీం భాష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
News April 23, 2025
KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.