News October 8, 2025

అమలాపురం: 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేత

image

నిరుద్యోగ యువత ప్రగతి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సంస్థ అవిరళ కృషి చేస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 123 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరికి ముఖాముఖి ఇంటర్వ్యూలు, అర్హత ధ్రువ పత్రాల పరిశీలన చేశారు. 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం: CGWB

image

APలో భూగర్భ జలాలు విస్తృతంగా కలుషితం అవుతున్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక పేర్కొంది. ‘ఏపీ సహా 4 రాష్ట్రాల భూగర్భ జలాల్లో 30Ppm మించి యురేనియం సాంద్రత ఉన్నట్లు తేలింది. సత్యసాయి జిల్లాలో 16, తిరుపతిలో 3 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. పలుచోట్ల పరిమితికి మించి సోడియం కార్బొనేట్ అవశేషాలు (26.87%) ఉన్నాయి. AP సహా కొన్ని రాష్ట్రాల భూగర్భంలోకి సముద్ర జలాలు చొచ్చుకువస్తున్నాయి’ అని తెలిపింది.

News January 12, 2026

ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందాలి: జేసీ

image

ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నమయ్య సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చేపడుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో వీడియో కాన్ఫరెన్స్ సీఎం నిర్వహించినట్లు తెలిపారు.

News January 12, 2026

సుల్తానాబాద్: ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు

image

సుల్తానాబాద్ మండలం కోమండ్లపల్లిలో ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. ఐలవేణి భాగ్యమ్మ (64) తన మరిది కుమారుడు సాయిని దత్తత తీసుకుని పెంచింది. మద్యం బానిసైన సాయి పనులకు వెళ్లకపోవడంతో ఆమె మందలించేది. దీంతో ఆస్తిపై కన్నేసిన సాయి, ఆదివారం రాత్రి ఆమెకు మద్యం తాగించి గొంతు నులిమి చంపేశాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.