News April 13, 2024
అమ్మవారి సేవలో హర్యానా గవర్నర్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏవిఎస్వో సతీష్ కుమార్, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News December 10, 2025
చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.
News December 10, 2025
చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
News December 10, 2025
పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.


