News March 5, 2025

అమ్రాబాద్: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

image

అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామానికి చెందిన మేతరి హుస్సేన్ (39) జనవరి 14న అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా మల్లెల తీర్థం సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఈగలపెంట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.

Similar News

News December 12, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

◈SKLM: పొందూరు ఖాధీకి భౌగోళిక గుర్తింపు
◈యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి
◈జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే కూన
◈లావేరు: రాళ్ళ దారిలోనే ప్రయాణం
◈శ్రీకాకుళం: ఏపీ ఎన్జీవో ఎన్నికలు ఏకగ్రీవం
◈టెక్కలి: అంగన్వాడీలకు 5జీ మొబైల్స్ వచ్చేశాయి
◈శ్రీకాకుళంలో అంగన్వాడీల ధర్నా
◈ఎచ్చెర్ల: నోటిఫికేషన్లు వేశారు.. నియామకాలు మరిచారు

News December 12, 2025

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*గద్వాల- నవోదయ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్
* గద్వాల్ జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు
*రెండో విడతలో 1.34 లక్షల మంది ఓటర్లు
*రెండోవిడత ఎన్నికలకు సిబ్బంది కేటాయింపు
*అయిజ- మున్సిపాలిటీలో వార్డులు పెంచాలి
*మల్దకల్- ఓటు హక్కు పై అవగాహన
*అలంపూర్- ఆలయంలో సామూహిక చండీ హోమం
*ఎర్రవల్లి- ప్రచారంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
*రాజోలి- భార్యను తీసుకువచ్చేందుకు వెళ్లి భర్త మృతి

News December 12, 2025

ఎన్నికల విధులకు డుమ్మా.. 15 మందిపై చర్యలు

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. తుంగతుర్తిలో 8, ఆత్మకూరు (ఎస్)లో 7 మంది విధులకు డుమ్మా కొట్టారని ఆయన వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.