News November 5, 2025
అయిజ: ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో నడిగడ్డ వాసి ఫస్ట్

ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. నడిగడ్డ వాసికి మొదటి స్థానం దక్కడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.
News January 14, 2026
మొక్కల్లో మాంగనీస్ లోప లక్షణాలు – నివారణ

మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.
News January 14, 2026
HYD: ఆకాశంలో తెగిపోని అనుబంధం!

పతంగి.. ఇది కాగితం ముక్క కాదు. నాన్న నేర్పిన మొదటి గెలుపు పాఠం. మాంజాకు వేళ్లు తెగుతున్నా లెక్కచేయకుండా పతంగిని తండ్రి గాల్లోకి విసిరే ఆ క్షణం ఒక అపురూపమైన దృశ్యం. ‘కింద పడినా మళ్లీ ఎగరాలి’ అని నేర్పే గాలిపటం స్ఫూర్తి గొప్పది. పొరిగింటి వాడి పతంగిని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కేకల్లో చిన్ననాటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఫోన్లకు దూరంగా కాటే నినాదాల నడుమ ఆకాశంలో తెగిపోని బంధంలా హైదరాబాదీలకు పతంగి మారింది.


