News August 13, 2025
అయిజ: మరణం లేని నాయకుడు తిరుమల్ రెడ్డి!

అయిజ మాజీ ZPTC ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి తన అవయవాలు దానం చేసి మరణం లేని నాయకుడిగా నిలిచాడు. నడిగడ్డలో అత్యంత ప్రజాదారణ పొందిన తిరుమల్ రెడ్డి అనారోగ్యంతో 2022 మార్చి 22న మరణించారు. ఆయన కళ్లు, కిడ్నీలు, లివర్ ఇతరులకు దానం చేసి కొత్త జీవితాన్ని అందించారు. విండో ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, 2 సార్లు ఎంపీపీ, ఒకసారి ZPTCగా పనిచేసి ప్రజాదరణ పొందారు. ఇలాంటి నాయకుడు మీ మండలంలో ఉంటే కామెంట్.
Similar News
News March 6, 2026
వెంకటగిరి విద్యార్థులకు లోకేశ్ అభినందనలు

వెంకటగిరి జడ్పీ స్కూల్ విద్యార్థులు మన్నవరం బస్సు కోసం వేచి ఉండగా పర్స్ దొరకడంతో పోలీసులకు <<19306615>>అప్పగించిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, పద్మశ్రీ, హేమలత చెల్లెమ్మలూ.. మీ నిజాయతీకి ఓ అన్నగా నేను గర్విస్తున్నా. మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చిట్టితల్లులు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News March 6, 2026
శ్రీవారు అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు కాదు: ధూళిపాళ్ల

టీటీడీ నెయ్యి టెండర్‌ను చంద్రబాబు ఇప్పించలేదని.. నిబంధనలు, సాంకేతిక పరీక్షల అనంతరం సంగం డెయిరీ ఎంపికైందని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంటే శ్రీవారు ఇప్పుడు అవకాశం ఇచ్చారన్నారు. 33 రోజులు తనను జైలులో పెట్టి సంగం సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో స్వామి దగ్గర YCP తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
News March 6, 2026
గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.


