News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News January 18, 2026
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామాగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మారారని మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నేతగా ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు.
News January 18, 2026
నా జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకం: CM

మేడారం వేదికగా సమ్మక్క – సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని సీఎం పేర్కొన్నారు.
News January 18, 2026
‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్ వెల్లడించింది.


