News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News January 13, 2026
20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
News January 13, 2026
ఇరాన్‌లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
News January 13, 2026
విద్యుత్ చార్జీలపై అభిప్రాయ సేకరణ.. ఎప్పుడంటే?

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


