News October 6, 2025

అరకు:గిరిజన పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి

image

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పండిట్ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ఆదివారం అరకులోయ నుంచి అసోసియేన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని 100% పండిట్ పీఈటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేసి ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. ఈ సమస్యపై విద్యాశాఖ మంత్రి న్యాయం చేయాలని కోరారు.

Similar News

News January 17, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎక్జిమ్<<>> బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటినుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ , PG (MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, IB, CAలో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. వయసు 21- 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.eximbankindia.in/

News January 17, 2026

చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

image

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.

News January 17, 2026

వరంగల్: 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

image

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
1. మహబూబాబాద్-ఎస్టీ జనరల్
2. గ్రేటర్ వరంగల్-జనరల్
3. కేసముద్రం-ఎస్టీ మహిళ
4. మరిపెడ-జనరల్ మహిళా
5. తొర్రూర్-జనరల్
6. డొర్నకల్-ఎస్సీ జనరల్
7.పరకాల-జనరల్
8. వర్ధన్నపేట-జనరల్
9. ⁠భూపాలపల్లి-బీసీ జనరల్
10. ⁠ములుగు-బీసీ మహిళ
11. ⁠నర్సంపేట-బీసీ మహిళా
12. ⁠జనగామ-బీసీ జనరల్
13. ⁠స్టేషన్ ఘన్‌పూర్-ఎస్సీ జనరల్