News September 12, 2025
అరకు: NITకి ఎంపికైన గిరిజన విద్యార్థి

అరకులోయ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న దుర్గబాబు అనే గిరిజన విద్యార్థి NITకి ఎంపికయ్యాడు. ఇటీవల విశాఖలోని నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 924 ర్యాంక్ సాధించగా జార్ఖండ్‌లోని బిలాస్పూర్‌లో ఉన్న NITలో ఐటీ బ్రాంచ్‌లో సీటు వచ్చింది. ఎలాంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఈ సీటు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, సిబ్బంది, తల్లిదండ్రులు దుర్గబాబుని అభినందించారు.
Similar News
News December 16, 2025
వరంగల్: 3వ విడతలో 530 పంచాయతీలకు ఎన్నికలు!

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫైనల్‌కి చేరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశలో 564 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 530 పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరగనుంది. వరంగల్ జిల్లాలో 107కి 7 ఏకగ్రీవం కాగా, హనుమకొండలో 68కి 1, జనగామలో 91కి 3, భూపాలపల్లిలో 81కి 3, ములుగులో 46కి 1, మహబూబాబాద్ జిల్లాలో 169కి 19 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
News December 16, 2025
‘అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా?

‘అఖండ-2’లో బాలకృష్ణ కూతురిగా నటించిన హర్షాలీ మల్హోత్రా గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని చూపించడంతో మీమ్స్ వస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి నాలుగేళ్లకే సీరియళ్లలో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించి మెప్పించారు. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
News December 16, 2025
తూ.గో: రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధర

కోడి గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. కోడిగుడ్డును టోకుగా రూ.6.75, చిల్లరగా రూ.8 విక్రయిస్తున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత మంచి ధర వచ్చిందని వ్యాపారులు సంబర పడుతున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలో 300 పౌల్ట్రీ ఫారాలు ఉండగా, వాటిలో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వాటి నుంచి 1.10 కోట్లు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మండపేటలో ఎక్కువగా పౌల్ట్రీ ఫారాలు విస్తరించాయి. ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు.


