News November 19, 2025
‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్‌ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్‌లకు ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల మెసేజ్‌ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్‌కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
Similar News
News January 17, 2026
DRDOలో JRF, RA పోస్టులు

<
News January 17, 2026
సౌదీ అరేబియాలో అరుదైన చిరుతల మమ్మీలు

నార్తర్న్ సౌదీ అరేబియాలోని గుహల్లో అరుదైన చిరుతల అవశేషాల(మమ్మీలు)ను అధికారులు గుర్తించారు. 130 నుంచి 1800ఏళ్ల మధ్య కాలం నాటివి అని రీసెర్చర్లు చెప్పారు. అరార్ సిటీకి సమీపంలో 54 చిరుతల ఎముకలతోపాటు ఏడు చీతా మమ్మీలను కనుగొన్నారు. క్లౌడీ కళ్లు, శరీర అవయవాలు ఎండిపోయినట్టు ఆ చిరుతల మృతదేహాలు ఉన్నాయి. ఎడారులు, హిమానీనదాలు, చిత్తడి నేలల్లో మమ్మిఫికేషన్ నేచురల్‌గా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News January 17, 2026
పాలమూరుకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు సాధించలేదు: CM రేవంత్

TG: పదేళ్ల BRS ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని MBNR జిల్లా పర్యటన సందర్భంగా CM రేవంత్ విమర్శించారు. ‘దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల శ్రమ ఉంది. కానీ ఈ జిల్లాకు KCR ఒక్క ప్రాజెక్టు సాధించలేదు. పాలమూరు-RR పేరిట రూ.23వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా ఎత్తిపోతలు పూర్తి చేయలేదు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు నిధులు చెల్లించలేదు’ అని ఆరోపించారు.


