News November 20, 2025

అరబికా పార్చిమెంట్ కిలో రూ.450: జీసీసీ ఛైర్మన్

image

పాడేరు: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాడేరులోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోలుకు ధరను అధికారికంగా ప్రకటించామన్నారు. 2025–2026 కాఫీ కొనుగోలు ధర అరబికా పార్చిమెంట్ కిలో రూ.450, అరబికా చెర్రీ కిలో రూ.270, రోబస్టా చెర్రీ కిలో రూ.170గా నిర్ణయించినట్లు చెప్పారు.

Similar News

News January 17, 2026

WPL: RCB హ్యాట్రిక్ విజయం

image

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ తడబడినా రాధా యాదవ్‌ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్‌ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్‌ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.