News April 2, 2024

అరవింద్, జీవన్‌రెడ్డి.. దొందూ దొందే : బాజిరెడ్డి

image

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.

Similar News

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

News February 18, 2026

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

image

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.