News November 30, 2025
అరుదైన ఫీట్.. 7వేల సెంచరీలు

అంతర్జాతీయ క్రికెట్‌లో 7వేల సెంచరీలు నమోదయ్యాయి. ఇవాళ దక్షిణాఫ్రికాతో మ్యాచులో కోహ్లీ చేసిన సెంచరీ 7000th కావడం విశేషం. కాగా తొలి సెంచరీ ఆస్ట్రేలియన్ ప్లేయర్ చార్లెస్ బాన్నర్‌మన్ 1877లో నమోదు చేశారు. 1,000వ శతకం ఇయాన్ చాపెల్(AUS) చేయగా, డీన్ జోన్స్(2,000), స్టీవ్ వా(3,000), కుమార సంగక్కర(4,000), రాస్ టేలర్(5,000), విక్రమశేఖర(6,000) మైల్‌స్టోన్ సెంచరీలు చేశారు.
Similar News
News February 18, 2026
OTD: టీమ్ఇండియా సంచలన విజయం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాజ్‌కోట్‌లో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ENGతో 3rd టెస్టులో 434 రన్స్ తేడాతో గెలిచింది. టెస్టుల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(131), జడేజా(112), రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (214), గిల్ (91) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి జడేజా 7, సిరాజ్ 4, బుమ్రా 2, అశ్విన్ 2, కుల్దీప్ 4 వికెట్లు తీశారు.
News February 18, 2026
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 16వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 37 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న BRS MP సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.
News February 18, 2026
‘అన్నా.. ప్లీజ్ వదిలేయ్ అన్నా’

అంటూ ఆ చిట్టితల్లి ఎంత ప్రాధేయపడి ఉంటుంది! ఆ మానవమృగ వికృతక్రీడలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఏపీలోని మదనపల్లెలో కులవర్ధన్ ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన <<19172410>>ఘటన<<>> తీవ్రంగా కలచివేస్తోంది. ఇంటి ముందే ఉండే అతడిని నిత్యం ఆప్యాయంగా ‘అన్నా.. అన్నా’ అని పిలిచినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. అత్యంత క్రూరంగా బాలికను నీటి డ్రమ్ములో కుక్కేశాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడు కూడా నీటిలోనే శవమై తేలాడు.


